తెనాలి: రూరల్ మండలంలోని కొలకలూరు గ్రామానికి చెందిన సాహితీవేత్త డాక్టర్ నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారికి గోదావరి కల్చరల్ అసోసియేషన్ కళా కిరీటి జాతీయ పురస్కారాన్ని అందజేసింది. ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ పంచమ వార్షికోత్సవ సందర్భంగా ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ అవార్డు అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు పరిధిలోని మలికిపురంలో ఆదివారం కళా కిరీటి జాతీయ పురస్కారాలను బహూకరించారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, గోదావరి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు చొప్పర శ్రీనివాస్, శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమడ ప్రతాప్, గోకా వెంకట్రావ్, నరసింహమూర్తి తదితరులు డాక్టర్ పూర్ణ ప్రజ్ఞాచారిని ఘనంగా సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment