తరలింపు వేగవంతం ..
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, బాపట్ల: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సొంత నియోజకవర్గం అద్దంకి ప్రాంతంలో పచ్చ నేతలు మట్టి, గ్రావెల్ అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు గుండ్లకమ్మ నది నుంచి ఇసుక, మరికొందరు నియోజకవర్గంలో ఇసుకతోపాటు గ్రావెల్, మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరంతా మంత్రి అనుచరులు కావడంతో అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అద్దంకి మండలం ధర్మవరంకు చెందిన పచ్చనేత ధర్మవరం పెద్ద చెరువు నుంచి గ్రావెల్ తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. 113 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో సుమారు పదికి పైగా యంత్రాలతో వంద టిప్పర్ల ద్వారా మట్టి తరలించి అమ్ముకుంటున్నారు. రేయింబవళ్లు అక్రమ రవాణా సాగుతోంది.
తాజాగా అద్దంకి నియోజకవర్గంలో ...
బెంగళూరు – అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా తాళ్లూరు ప్రాంతం నుంచి అద్దంకి నియోజకవర్గం ముప్పవరం వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. చెరువు నుంచి రోజుకు వందలాది ట్రిప్పర్ల మట్టి, గ్రావెల్‌ను హైవేకు తరలిస్తున్నారు. దీంతోపాటు అద్దంకి నియోజకవర్గంలోని రియల్ వెంచర్లు, ఇతర అవసరాలకు ధర్మవరం చెరువు నుంచే గ్రావెల్ తరలిస్తున్నారు. ఒక టిప్పర్ గ్రావెల్‌కు హైవే కాంట్రాక్టర్లు రూ.ఐదు వేలు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన రాబడి రోజుకు రూ.లక్షల్లో ఉన్నట్లు అంచనా.
న్యూస్‌రీల్
ధర్మవరం పెద్ద చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలింపు బెంగళూరు – అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి సరఫరా విద్యుత్ మంత్రి ఇలాకాలో ఆగని గ్రావెల్, మట్టి దందా రియల్ వెంచర్లకూ ఇక్కడి నుంచే సరఫరా
గ్రావెల్, మట్టి రవాణాపై ‘సాక్షి’లో కథనం రావడంతో తరలింపును కొద్ది రోజులు నిలిపి, ఇప్పుడు మళ్లీ వేగవంతం చేశారు. చెరువు నుంచి మట్టి లేదా గ్రావెల్ తరలించాలంటే నిబంధనల మేరకు నీటిపారుదల శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. అయితే తనకు అనుమతులు ఉన్నట్లు సదరు నేత బుకాయిస్తున్నట్లు సమాచారం. వాస్తవంగా అనుమతులు ఉంటే రోజువారీ తరలిస్తున్న మట్టి, గ్రావెల్ వివరాలు, ప్రభుత్వానికి ఎంత మొత్తం చెల్లించారో కూడా తెలియజేయాలి. ఆ వివరాలు అధికారులకు ఇచ్చిన దాఖలాలు కనిపించడంలేదు. నియోజకవర్గంలో పలు చెరువులు ఉన్నా ఆయా గ్రామాల ప్రజలు గ్రావెల్, మట్టి అక్రమ తరలింపుకు అంగీకరించ లేదని తెలుస్తోంది. తొలుత ఇదే మండలంలోని కలవకూరు, శింగరకొండ తదితర గ్రామాల చెరువుల నుంచి గ్రావెల్ తరలించేందుకు పచ్చనేతలు ప్రయత్నించగా గ్రామస్తులు అంగీకరించలేదు. ముళ్ల కంపలు, ఇతర చెట్లు ఉన్న ధర్మవరం చెరువును ఆధునీకరించాల్సిన అధికారులు, పచ్చనేతలు కుమ్మకై ్క మట్టి, గ్రావెల్ అమ్మకానికి పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తరలింపు వేగవంతం ..
తరలింపు వేగవంతం ..
Comments
Please login to add a commentAdd a comment