ట్రాక్టర్ అడ్డుపెట్టి దౌర్జన్యం
బల్లికురవ: కూటమి ప్రభుత్వంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. గ్రామ పంచాయతీ రోడ్డుపై ఏకంగా ట్రాక్టర్ అడ్డుపెట్టి రాకపోకలకు ఇబ్బందులు సృష్టించారు. ఫిర్యాదు చేసినా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వారి ‘పచ్చ’పాతానికి నిదర్శనంగా మారింది.
●వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని అంబడిపూడి గ్రామ పంచాయతీలోని చిన అంబడిపూడి గ్రామంలోని బీసీ కాలనీలో గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి సర్పంచ్ మందలపు శ్రీలక్ష్మి, బుజ్జి ఆనందరావు ఇంటినుంచి పల్లపు రామకృష్ణారావు ఇంటివరకు సిమెంట్ రోడ్డు వేశారు. నిధుల లేమితో సైడు కాలువల పనులు నిలిచాయి. ఈ రోడ్డులోని టీడీపీ నాయకుడు మన్నం శ్రీను తన ఇంటిముందుకు మురుగు నీరు వస్తుందంటూ రోడ్డుపై మట్టికుప్పలు తోలి రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ ట్రాక్టర్‌ను అడ్డుపెట్టాడు. దీంతో స్థానికంగా ఉండే బాధితులు పల్లపు రామకృష్ణారావు, వెంకటరావు, వెంకటరమణ, శారద, మహేష్‌బాబులు ఇప్పటికే రెండు పర్యాయాలు గ్రీవెన్స్‌లో తహసీల్దార్ రవినాయక్‌కు, ఎంపీడీఓ కుసుమ కుమారికి ఫిర్యాదు చేశారు. ఇదంతా మనుసులో పెట్టుకున్న మన్నం శ్రీను నాపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ గొడవలకు దిగడంతో ఫిర్యాదుదారులు ఐదుగురితో పాటు మన్నం శ్రీను ఆయన భార్య భూలక్ష్మిని జనవరి 23న తహసీల్దార్ వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా బైండోవర్ చేశారు. అయితే సమస్య మాత్రం పరిష్కారం కాలేదని తమ ఇంటి ముందు రోడ్డులో నడిచి వెళ్లలేకపోతున్నామని బాధితులు వాపోయారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకుని రోడ్డుకు పెట్టిన అడ్డంకులను తొలగించి రాకపోకలకు ఇబ్బందులు తొలగించాలని బాధితులు కోరుతున్నారు.
రాకపోకలకు తీవ్ర ఆటంకం బల్లికురవ మండలం అంబడిపూడి గ్రామంలో టీడీపీ నేత దాష్టీకం
ట్రాక్టర్ అడ్డుపెట్టి దౌర్జన్యం
Comments
Please login to add a commentAdd a comment