దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి,
ఇద్దరికి గాయాలు
మార్టూరు: దైవ దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా ఇంటికి చేరకుండానే ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈఘటన మార్టూరు 16వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగింది. హైవే అంబులెన్స్ సిబ్బంది రవి, స్థానికుల వివరాల మేరకు.. జూలూరు శ్రీకృష్ణ (40), జూలూరు వంశీకృష్ణ, కె.వివేక్‌లు తిరుపతి, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని తిరిగి నూజివీడుకు కారులో బయలుదేరారు. సరిగా ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో స్థానిక దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ సమీపంలో వీరి వాహనం అదుపుతప్పి మొదట ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టి అనంతరం డివైడడ్‌ను ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు తీవ్రంగా ధ్వంసం కాగా అందులో ఉన్న ముగ్గురిలో జూలూరు శ్రీకృష్ణ (40) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మిగిలిన వంశీకృష్ణ, వివేక్‌లు గాయాలతో బయటపడ్డారు. 108 సిబ్బంది క్షతగాత్రులను చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..
Comments
Please login to add a commentAdd a comment