ఇస్సోపార్బ్ అధ్యక్షురాలిగా డాక్టర్ సులేఖా పాండే
మంగళగిరి: ఇండియన్ సొసైటీ ఆఫ్ పెరినాటాలజీ అండ్ రీ ప్రొడక్ట్ మెడిసన్(ఇస్సోపార్బ్) కొత్త అధ్యక్షురాలిగా డాక్టర్ సులేఖా పాండే బాధ్యతలు స్వీకరించారు. నగర పరిధిలోని చినకాకాని ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాలలో మూడు రోజులు పాటు నిర్వహించిన ఇస్సోపార్బ్ 40వ జాతీయ సదస్సు సోమవారం ముగిసింది. మూడు రోజులు పాటు నిర్వహించిన సదస్సులో పెరినాటాలజీ, రీ ప్రొడక్ట్ మెడిషన్‌లోని కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. సదస్సును ఇస్సోపార్బ్ విజయ వాడ చాప్టర్ నిర్వహించింది. ప్రారంభోత్సవానికి ఇస్సోపార్బ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నారా యణ జానా, కార్యదర్శి డాక్టర్ మిశ్రా చౌదరి, ఎన్టీఆర్‌యూహెచ్‌ఎస్ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి హాజరై అనేక అంశాలను చర్చించారు. చాప్టర్ అధ్యక్షురాలు డాక్టర్ కె.గీతాదేవి, కార్యదర్శి కె.లత ప్రాతినిథ్యం వహించగా 450 మంది ప్రతినిధులు హాజరైన కార్యక్రమంలో పెరినాటాలజీ, రీ ప్రొడక్ట్ మెడిషన్‌లోని పలు అంశాలను చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment