కాజ టోల్ ప్లాజాను రద్దుచేయాలి
మంగళగిరి టౌన్: మంగళగిరి– తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని అధిక టోల్‌ఫీజు వసూలు చేస్తున్న కాజ టోల్‌ప్లాజాను వెంటనే రద్దు చేయాలని ప్రయాణికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ బాల వెంకటరావు, ప్రధాన కార్యదర్శి నన్నపనేని నాగేశ్వరరావు కోరారు. మంగళగిరి నగర పరిధిలోని ప్రెస్‌క్లబ్‌లో సోమ వారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కాజ టోల్‌గేట్ వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు 79 కిలోమీటర్ల దూరంలో టోల్‌ప్లాజా ఉండకూడదని దీనిపై లారీ ఓనర్స్ మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో రూ.150 ఉండే టోల్‌పాస్ ఇప్పుడు రూ.340 చేశారని దీనిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. గుంటూరు, విజయవాడ మధ్యలో ఉన్న ఈ టోల్‌గేటును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment