చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించాలి
తాడికొండ: చిన్నారులకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందించే టీకాలు సకాలంలో వేయించేలా సిబ్బంది చొరవ తీసుకోవాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎ.శ్రావణ్ బాబు అన్నారు. సోమవారం తుళ్లూ రు పీహెచ్‌సీని సందర్శించిన ఆయన వైద్య బృందంతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిన్నారులకు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఏఏ టీకాలు ఏ సమయంలో వేయించాలి అనే విషయంపై స్పష్టంగా అవగాహన కల్పించాలని కోరారు. టీకాలకు సంబంధించిన సమాచారాన్ని యు విన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసే విధానాన్ని వివరించారు. గ్రామాల్లో సీడీఎన్‌సీ సర్వే చేసి ప్రతి గ్రామంలోని కుటుంబాలకు ఐడీ నంబర్లు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారులు డి.శ్రీనివాస్, వసుంధర, శివపార్వతీ, సీహెచ్‌ఓ వెంకట రమణ, ఎంఎస్ రాణి, పర్యవేక్షకులు సుధాకర్, డీఎస్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ కరీమ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment