అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి
రేపల్లె రూరల్: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కే.ఝాన్సీ అన్నా రు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీవో ఎం.సుచిత్రకు అంగన్‌వాడీ కార్యకర్తలు సోమవారం వినతిపత్రం అందజేసి అనంతరం మాట్లాడారు. అంగన్‌వాడీలకు గ్రాడ్యుటీని వెంటనే అమలు చేయాలన్నారు. అంగన్‌వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలన్నారు. కనీస వేతనం రూ.26000 అందించాలన్నారు. రాష్ట్రంలోని మొత్తం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు నిర్ధిష్టమైన గైడ్‌లైనెన్స్‌ను రూపొందించి అమలు చేయ్యాలన్నారు. సంక్షేమ పథకాలు అంగన్‌వాడీలకు అమలు చేయాలన్నారు. సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలని కోరారు. సర్వీసులో ఉండి చనిపోయిన వారికి దహన సంస్కార ఖర్చు లకు రూ.20 వేలు, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. సమ్మెకాలంలో చనిపోయిన వారికి సైతం ఇదే విధానాన్ని కొనసాగించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న సెంటర్ అద్దెలు, టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలని, అన్నియాప్‌లు కలిపి ఒకేయాప్ మార్పు చేయాలని, పెండింగ్లో ఉన్న 164 సూపర్‌వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మెనూ చార్జీలు పెంచటంతో పాటు ఉచితంగా గ్యాస్ సరఫరా చేయ్యాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ కనీసం మూడు నెలలు ఇవ్వాలన్నారు. ప్రీ స్కూల్ బలోపేతం చేయ టంతో పాటు ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎన్. కృష్ణకుమారి కె.రత్నకుమారి, నిర్మల జ్యోతి, డి.జ్యోతి, శ్రీలక్ష్మి, రాజ్యలక్ష్మి, సీఐటీయూ నాయకులు కె.వి.లక్ష్మణరావు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ
Comments
Please login to add a commentAdd a comment