క్వారీ తిరునాళ్లకు సకల సౌకర్యాలు
చేబ్రోలు: మహారాత్రి సందర్భంగా క్వారీ తిరునాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తెనాలి సబ్‌కలెక్టర్ సంజనా సింహా ఆదేశించారు. వడ్లమూడి క్వారీ తిరునాళ్ల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ అధికారుల కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. భక్తుల అభిషేకాలు, దర్శనాలు, తాగునీటి వసతి, పారిశుద్ధ్య నిర్వహణ, ఎలక్ట్రికల్ ప్రభల బరువు, సామర్థ్యం, ఎత్తు, ట్రాఫిక్ నియంత్రణ, వెహికల్స్ పార్కింగ్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అధికారులను శాఖల వారీగా విడిది స్టాల్స్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ ఈఓ రామకోటేశ్వరరావు మాట్లాడుతూ మూడు రోజులు పాటు వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతాయని, ఈ వేడుకల్లో మొదటిరోజు పశువుల ప్రదక్షిణలు ఉంటాయని, రెండో రోజు వాహనాల ప్రదక్షిణలు పూజలు ఉంటాయని, మూడవరోజు ఈనెల 26వ భక్తుల అభిషేకాలు మహాశివరాత్రి వేడుకలు ఉంటాయని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ కె.శ్రీనివాసశర్మ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ.ఉమాదేవి, ఈఓపీఆర్డీ టి.ఉషారాణి, ఆలయ ఈఓ రామకోటేశ్వరరావు, తిరునాళ్ల కమిటీ చైర్మన్ జి.శ్రీకాంత్, 52 శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెనాలి సబ్‌కలెక్టర్ సంజనా సింహా
Comments
Please login to add a commentAdd a comment