దగా పెరిగింది!
స్టయిల్ మారింది..
అధికారుల పేర్లతో ఫోన్లు.. ఆనక ఫోన్‌పేలు
అప్రమత్తంగా ఉండాలి
ఆన్‌లైన్ ద్వారా మోసపోయినట్లు ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదులు మా దృష్టికిరాలేదు. అయితే చాలా మంది ఇటువంటి మోసాలబారిన పడినట్లు సమాచారం ఉంది. ప్రజలకు వీటిపై అవగాహన సదస్సులు నిర్వహించి, అప్రమత్తం చేస్తున్నాం. ప్రజలు తమ ఫోన్‌లలో యాప్‌లను ఉపయోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ సైబర్ నేరాల బారిన పడిన వారు నిర్భయంగా పోలీసు స్టేషన్‌లో పిర్యాదులు చేయాలి.
– మల్లికార్జునరావు, పట్టణ సీఐ, రేపల్లె
రేపల్లె రూరల్: సైబర్ నేరాలు తీరప్రాంతమైన రేపల్లెలోనూ పెచ్చుమీరుతున్నాయి. సైబర్ కేటాగాళ్ల ఉచ్చులో పట్టణంలోని అమాయకపు ప్రజలు ఇట్టేపడిపోతూ మోసపోతున్నారు. సైబర్ కేటుగాళ్లు పేద, మధ్య తరగతివారికి సైతం ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి పలు సామాజిక మాధ్యమాల్లో ఎరవేస్తూ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. నేటి వరకు ఉద్యోగాలు, లక్కీడీప్‌లు అంటూ ఎరవేసిన కేటుగాళ్లు ప్రస్తుతం ప్రభుత్వ అధికారుల పేరుతో ఫోన్ చేసి ఆన్‌లైన్‌లో పన్నులు చెల్లించాలని కొత్తతరహా వసూళ్లకు తెరతీశారు.
దుస్తులు, సెల్‌ఫోన్ల పేరుతో టోకరా..
పట్టణానికి చెందిన గోపీ అనే యువకుడు ఫేస్‌బుక్ చూస్తుండగా అందులో మంచి మోడల్ దుస్తులు తక్కువ ధరకు కనిపించాయి. రూ.5వేల నుంచి రూ.10వేల విలువ చేసే దుస్తులు ఆఫర్‌లో కేవలం రూ.2వేలకే ఇస్తున్నట్లు చూపించాయి. వెంటనే డబ్బులను చెల్లించి దుస్తులను బుక్‌చేశాడు. వారం రోజుల తరువాత పనికిరాని దుస్తుల పీలికలతో డెలివరీ అయిన ప్యాకెట్‌ను ఓపెన్ చేసి చూసి నివ్వెరపోయాడు. రిటన్ పెట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అదేవిధంగా ఒక ప్రముఖ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ యాప్‌లో మొబైల్ ఫోన్‌లు విక్రయిస్తున్నట్లు వినయ్ అనే యువకుడు తన ఫోన్‌లో వచ్చిన మెసెజ్‌లో చూశాడు. రూ.80,000 విలువ చేసే ఆపిల్ ఐఫోన్ రూ.2వేలకు, రూ.48వేల విలువ చేసే రీయల్‌మీ ఫోన్ కేవలం రూ.1600కు వస్తున్నట్లు ఆఫర్‌లో చూపుతోంది. వెంటనే డబ్బులు రూ.4వేలు చెల్లించి రెండు ఫోన్‌లను బుక్ చేసుకున్నాడు. తదుపరి పరిశీలించగా ప్రముఖ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ యాప్ పేరుతో, అదే డిజైన్‌లో రూపొందించిన డూప్లికేట్ యాప్ అని, తాను మోసపోయానని గ్రహించి, పలువురి వద్ద బావురమన్నాడు.
రూటు మార్చి పేట్రేగుతున్న సైబర్ మోసగాళ్లు రేపల్లెలో మున్సిపల్ చలానాలపేరుతో డబ్బులు స్వాహా సామాజిక మాధ్యమాల్లోనూ ఇదే తంతు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
స్పందించవద్దు
మున్సిపల్ కార్యాలయానికి చెల్లించాల్సిన పన్నులు, ఫీజులు కార్యాలయంలో చెల్లించి రశీదులు పొందాలి. మున్సిపల్ కార్యాలయం పేరుతో అధికారులమంటూ ఎవరూ ఫోన్ చేసి ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాలని కోరినా స్పందించవద్దు. మున్సిపల్ కార్యాలయం పేరుతో సైబర్ కేటుగాళ్లు ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించాలని వ్యాపారులకు ఫోన్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై వ్యాపారులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
– కాకర్ల సాంబశివరావు,మున్సిపల్ కమిషనర్, రేపల్లె
దగా పెరిగింది!
దగా పెరిగింది!
Comments
Please login to add a commentAdd a comment