పౌష్టికాహారంతో దృష్టి లోపాలకు చెక్
బాపట్ల: విద్యార్థులు దృష్టి లోపం రాకుండా పౌష్టికాహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పురపాలక ఉన్నత పాఠశాలలో పలువురు విద్యార్థులకు కళ్ల అద్దాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం 3 వేల మంది విద్యార్థులకు కళ్ల అద్దాలు పంపిణీ చేశామన్నారు. డీఈఓ పురుషోత్తం, డీఎంహెచ్‌ఓ విజయమ్మ, బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా పాల్గొన్నారు. ఈక్రమంలో మున్సిపల్ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న వై.వెంకట వసంతకు కలెక్టర్ రూ.10వేలు అందజేశారు.
ఓటు హక్కు కరపత్రాలు ఆవిష్కరణ..
బాపట్ల: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు అత్యంత జాగురూకతతో ఓటు చేయవలసి ఉంటుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.వెంకట మురళి చెప్పారు. ఓటర్లు ప్రథమ ప్రాధాన్యతా ఓటును నమోదు చేయనట్లయితే వారి ఓటు చెల్లుబాటు కాదన్నారు. మంగళవారం ఓటింగ్ విధానంపై ఎన్నికల నిఘావేదిక ప్రచురించిన కరపత్రాలను ఆయన కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు.
బాలికల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి
బాపట్ల: బాలికల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ఆదేశించారు. బాలికల సంక్షేమం, హక్కుల పరిరక్షణపై అనుబంధ శాఖల అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుంచి వీడియో సమావేశం ఆయన నిర్వహించారు. బాలికల హక్కుల పరిరక్షణకు జిల్లాస్థాయిలో కమిటీని నియమించనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ పని చేస్తుందన్నారు. అదేవిధంగా పీఎంఈజీపీ రుణాల మంజూరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
Comments
Please login to add a commentAdd a comment