ట్రేడ్ లైసెన్స్‌ల పేరుతో..
వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ పన్నులు చెల్లించాలని వారం రోజుల క్రితం డిమాండ్ చలానాలను మున్సిపల్ అధికారులు అందించారు. పన్నులు సకాలంలో చెల్లించాలని విస్తృతంగా ప్రచారం చేశారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఓ సైబర్ కేటుగాడు ఇటీవల ఓ ప్రైవేటు వైద్యశాలకు 6300805117 నంబరు నుంచి ఫోన్ చేసి మున్సిపల్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం.. మీరు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించలేదు.. నేటితో రూ.1500 చెల్లిస్తే సరిపోతుందని, లేనిపక్షంలో పెనాల్టీలు చెల్లించాలని నమ్మబలికాడు. వెంటనే ఫోన్‌పే చేస్తే సరిపోతుందని, రశీదును మీకు వాట్సాప్‌లో పంపుతానన్నాడు. 8349772206 నంబరుకు ఫోన్‌పే చేయమన్నాడు. దీంతో ఆ వైద్యశాల సిబ్బంది ఫీజును ఫోన్‌పే ద్వారా చెల్లించారు. ఎంతసేపటికి రశీదు పెట్టకపోవటం, ఫోన్ చేసినా సమాధానం ఇవ్వకపోవటంతో మున్సిపల్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లగా తాము మోసపోయినట్లు గ్రహించారు. ఇలాగే పట్టణంలో పలువురికి ఫోన్లు చేసినట్లు సమాచారం. దీంతో మున్సిపల్ అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఫీజులను కార్యాలయంలోనే చెల్లించాలని, ఎవరు ఫోన్ చేసినా స్పందించవద్దని ప్రచారం చేసి ప్రకటనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment