ఇంజినీ‘రింగ్‌ రింగ’ | - | Sakshi
Sakshi News home page

ఇంజినీ‘రింగ్‌ రింగ’

Published Wed, Feb 19 2025 1:34 AM | Last Updated on Wed, Feb 19 2025 1:31 AM

ఇంజినీ‘రింగ్‌ రింగ’

ఇంజినీ‘రింగ్‌ రింగ’

నెహ్రూనగర్‌(గుంటూరు ఈస్ట్‌): ఇంజినీరింగ్‌ విద్యార్థులు రింగరింగ అంటూ మత్తులో మునిగితేలుతున్నారు. నిషేధిత మత్తు పదార్థాలను కలిగి ఉండడంతోపాటు వాటిని తక్కువ ధరకు కొని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నాలుగేళ్లుగా గుంటూరులో సాగుతున్న ఈ మత్తు దందాను ఎకై ్సజ్‌ శాఖ అధికారులు తాజాగా రట్టు చేశారు. ఎకై ్సజ్‌ శాఖ డెప్యూటీ కమిషనర్‌ కె.శ్రీనివాసరావు మంగళవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మంగళగిరి రూరల్‌ మండలం కాజకు చెందిన ఎం.సాయి కృష్ణ గుంటూరు సమీపంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతని సోదరుడు బెంగళూరులో సాప్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుంటాడు. సోదరుడి దగ్గరకు సాయి కృష్ణ వెళ్లిన సమయంలో అదే రూంలో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, తెనాలి చినరావూరుకు చెందిన ధరావత్‌ సతీష్‌కుమార్‌ పరిచయమయ్యాడు. సతీష్‌కుమార్‌కు బెంగళూరుకు చెందిన నితిన్‌తో కలిసి ఎండీఎంఏ మత్తుమందును సేవించేవాడు. దీనిని సాయికృష్ణ కూడా అలవాటు చేసుకున్నాడు. ఈ మత్తుమందును గుంటూరులోనూ అమ్ముకోవచ్చని, లాభాలు పొందొచ్చని సతీష్‌కుమార్‌, నితిన్‌ సాయికృష్ణకు సూచించారు. దీంతో నితిన్‌ ద్వారా ఎండిఎంఏ మత్తు మందును నాలుగేళ్లుగా సాయి కృష్ణ, సతీష్‌ కుమార్‌ ఇద్దరూ గుంటూరు తీసుకొచ్చి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులకు అమ్ముతున్నారు. సాయి కృష్ణ ఇటీవల గుంటూరు సమీపంలోని గోరంట్ల ప్రాంతంలో కోదండ రామా నగర్‌ లోని సాయి లక్ష్మీ అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాట్‌ అద్దెకు తీసుకొని అక్కడి నుంచే దందా నిర్వహిస్తున్నాడు.

గుట్టురట్టు ఇలా..

రెండు రోజుల క్రితం గుంటూరు ఎకై ్సజ్‌–2 టౌన్‌ సీఐ ఎం. యశోధర దేవి, ఆమె సిబ్బంది బృందావన్‌ గార్డెన్స్‌ సమీపంలోని వేంకటేశ్వర స్వామి గుడి రోడ్డులో తనిఖీ చేస్తుండగా ఇద్దరు ద్విచక్ర వాహనాన్ని ఆపి నిలబడి ఉన్నారు. అనుమానం వచ్చిన ఎకై ్సజ్‌ అధికారులు వారిని ప్రశ్నించారు. ఇద్దరూ తడబడుతుండడంతో వారిని తనిఖీ చేశారు. ఇద్దరి వద్ద 2.52 గ్రాముల మత్తు మందును స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్కడ కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించగా సాయి కృష్ణ వద్ద కొన్నామని తెలిపారు. సాయి కృష్ణ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌కి వెళ్లి విచారించగా అతని వద్ద 8.15 గ్రాముల మత్తు మందుతోపాటు, ఏడుగురు విద్యార్థులు, ఒక కేజీ గంజాయి, ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ ఫోన్లు లభించాయి. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులు ఉండగా 9 మందిని అరెస్ట్‌ చేసి కోర్టు హాజరు పరిచినట్లు ఎకై ్సజ్‌ శాఖ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇంకా గంజాయి సరఫరా చేస్తున్న సాయి కృష్ణ బంధువు వేంపాటి చైతన్యతోపాటు బెంగళూరుకు చెందిన నితిన్‌ను అరెస్ట్‌ చేయాల్సి ఉంది. వీరు పరారీలో ఉన్నట్టు ఎకై ్సజ్‌ అధికారులు తెలిపారు.

మత్తు పదార్థాలు విక్రయిస్తూ పట్టుబడిన విద్యార్థులు 9 మంది అరెస్టు, పరారీలో ఇద్దరు బెంగళూరు నుంచి తక్కువ రేటుకు దిగుమతి గుంటూరులో అధిక ధరకు అమ్మకాలు వివరాలు వెల్లడించిన ఎకై ్సజ్‌ శాఖ డెప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసులు

బెంగళూరులో గ్రాము రూ.1400కు కొనుగోలు

ఎండీఎంఏ మత్తుమందును బెంగళూరులో గ్రాము రూ.1400 కొని ఇక్కడికి తీసుకొచ్చి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు రూ.4 వేల నుంచి రూ.ఐదువేలకు అమ్ముతున్నట్టు ఎకై ్సజ్‌ అధికారులు గుర్తించారు. గుంటూరు సమీపంలోని ప్రధానంగా రెండు ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులకు ఈ మత్తు మందును సాయి కృష్ణ అలవాటు చేసినట్లు తెలుస్తోంది. గోరంట్లలోని తన ఫ్లాట్‌లోకి విద్యార్థులను పిలిపించి మత్తుమందు, గంజాయి అమ్ముతున్నట్టు సమాచారం. నాలుగేళ్లుగా ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్న సాయికృష్ణ తన గ్రామానికి చెందిన సమీప బంధువుతో ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తెప్పించి విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు ఎకై ్సజ్‌ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ యశోధర దేవిని ఎకై ్సజ్‌ డెప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. సీఐతో పాటు ఎస్‌ఐలు సత్యనారాయణ, మాధవి, హెడ్‌ కానిస్టేబుల్స్‌ హనుమంతురావు, సీహెచ్‌ రాజు, మైలా శ్రీనివాసరావు, రవిబాబు, బీఎస్‌ఎన్‌రాజు, పి నాగేశ్వరరావు, ఎం సూర్యనారాయణ, వివి చారి, చిన్న బాబు తదితరులనూ అభినందించారు. సమావేశంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ రవి కుమార్‌ రెడ్డి, గుంటూరు ఎకై ్సజ్‌ శాఖ అధికారి వి అరుణ కుమారి, ఏ ఈ ఎస్‌ ఈడే మారయ్య బాబు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement