రైల్వే ఉద్యోగుల సమస్యలను కేంద్రం పరిష్కరించాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రైల్వే శాఖ అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శి ఎస్.మంజునాథ్, ఎం.వి ప్రసాద్ డిమాండ్ చేశారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లోని యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన నిరాహార దీక్ష శిబిరంలో వారు మాట్లాడుతూ రైల్వే ఉద్యోగుల సమస్యలను వివరించారు. అనంతరం రైల్వే ఉద్యోగులు నినాదాలతో హోరెత్తించారు. కేంద్రం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ డివిజన్ ట్రెజరర్ ఎస్.జి.కృష్ణయ్య, ఏడీఎస్ కె.కోటేశ్వరరావు, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ట్రెజరర్ సాంబశివరావు, ఏడీఎస్‌లు కరుణశ్రీ, హక్, లావణ్య, సంఘ నాయకులు వెంకటేష్, సాయి కృష్ణ, కిరణ్, ప్రసాంత్, మూర్తి, టి.వి.రావు, సునీల్‌కుమార్, ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment