ఇంటింటా ప్రకృతి సేద్యపు పంట
మార్టూరు: అరెకరా భూమిలో ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా రుచికరమైన 26 రకాల కూరగాయల పంటలను ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు మండల ప్రకృతి సేద్యపు సిబ్బంది. మండలంలోని బొల్లాపల్లి గ్రామానికి చెందిన పల్లపు శ్రీనివాసరావు భూమిలో చేస్తున్న ఈ ప్రయోగం స్థానిక రైతులను, మహిళలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ భూమిలో సిబ్బంది 11 రకాల ఆకుకూరలు, ఆరు రకాల దుంప జాతి, ఏడు రకాల కూరగాయలు, బంతి, ఆముదం వంటి ఎర్ర పంటలను అంతర పంటలుగా సాగుచేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ప్రధాన పంటగా కాకర పాదులు నేలపై పాకే విధంగా కాకుండా ఫెన్సింగ్ పైకి అల్లుకునే విధంగా సాగు చేస్తూ ఒక్కో సాలుకు మధ్య పది అడుగుల భూమిని వదిలారు. కొన్ని సాళ్ల మధ్య క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బీన్స్, అనప, పప్పు చిక్కుడు వంటి కూరగాయలు సాగు చేస్తున్నారు. మరికొన్ని సాళ్ల మధ్యలో పాలకూర, చుక్కకూర, మెంతికూర, కొత్తిమీర, గోంగూర, తోటకూర వంటి 11 రకాల ఆకుకూరలతోపాటు ఎర్ర పంటలైన బంతిపూలు, ఆముదం చెట్లు సాగు చేస్తున్నారు. దుంప జాతి రకాలైన ముల్లంగి, క్యారెట్, బీట్ రూట్, చిలగడ దుంపలు తదితర ఆరు రకాల మొక్కలతో నోరూ రిస్తున్న పంటలను స్థానిక రైతులు ఆదర్శంగా తీసుకొని తమ ఇంటి పెరట్లో సైతం ఇలాంటి పంటలను సాగు చేయడం గమనార్హం.
అర ఎకరం భూమిలో 26 రకాల పంటలు 16 రకాల న్యూట్రి గార్డెన్ ఏర్పాటు చేసిన మహిళ సుజాత అవగాహన కల్పిస్తున్న సిబ్బంది
మార్కెటింగ్ సదుపాయంకల్పించాలి
రైతులు, ప్రకృతి సేద్యపు సిబ్బంది క్షేత్రస్థాయిలో కష్టపడి పండిస్తున్న పంటలకు ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పించి గిట్టుబాటు ధరలు కల్పిస్తే ప్రజలకు రసాయనిక రహిత ఆరోగ్యకరమైన కూరగాయలు ఆకుకూరలు అందించవచ్చు. ఆసక్తి గల రైతులు విధానాన్ని పాటించాలి.
– వీరవల్లి కృష్ణమూర్తి, మండల రైతు సంఘం అధ్యక్షుడు.
ఇంటింటా ప్రకృతి సేద్యపు పంట
Comments
Please login to add a commentAdd a comment