వెల్దుర్తిలో తీవ్ర విషాదం
● రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతురు మృతి ● ఆగివున్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొట్టగా ఘటన ● ఘటనాస్థలంలోనే మృతి చెందిన వైనం
వెల్దుర్తి: ఆగివున్న ట్రాక్టర్‌ను ఢీకొని తండ్రి కూతురు మృతిచెందిన విషాదకర సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని మిట్టమీదపల్లె గ్రామానికి చెందిన పల్లా శ్రీనివాసరావు (30), తన కుమార్తె రూప (3)తో కలిసి ద్విచక్రవాహనంపై మాచర్ల నుంచి స్వగ్రామం మిట్టమీదపల్లెకు వెళ్తున్నారు. ఈక్రమంలో వేగంగా వెళ్తూ 565 జాతీయ రహదారిలో వెల్దుర్తి సమీపంలోని పెట్రోలు బంకువద్ద రోడ్డు మార్జిన్‌లో నిలుపుదల చేసిన ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పల్లా శ్రీనివాసరావు, రూపలు తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వెల్దుర్తిలో తీవ్ర విషాదం
Comments
Please login to add a commentAdd a comment