బ్రహ్మాండ నాయకుడు
సింహ వాహనంపై
గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చిన నారసింహుడు
మంగళగిరి / మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి గ్రామోత్సవంలో స్వామి వారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మాండ నాయకుడు నృసింహస్వామిని భక్తులు దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చారు. హింసించే స్వభావం గల వారిని హింసించేవాడు నారసింహుడు, నరుల్లో సింహం వంటి వాడు నరసింహ స్వరూపుడైన స్వామి వారి సింహ వాహనోత్సవం తిలకించిన వారికి దుర్మార్గుల వల్ల కలిగే భయం తొలగుతుందని భక్తుల నమ్మకం. ఉత్సవం సందర్భంగా రాజావాసిరెడ్డి వెంకట్రాది నాయుడు కళావేదికలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఆలయ ఈవో రామకోటిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మాల్యవంతం వెంకట కృష్ణమాచార్యులు మనుమలు వ్యవహరించారు.
ఉదయం చిన్న శేషవాహనంపై...
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం చిన్నశేష వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కై ంకర్యపరులుగా దేవతి భగవన్నారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
నేడు హంస, గజ వాహన సేవలు
మంగళవారం ఉదయం హంస వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి గజ వాహనంపై స్వామికి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.
బ్రహ్మాండ నాయకుడు
బ్రహ్మాండ నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment