అర్జీలను సత్వరం పరిష్కరించాలి
జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్
బాపట్ల, చీరాల టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జేసీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను గడువు లోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లాలో నీటిపన్ను వసూలుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. జిల్లాలో పీ–4 సర్వేను వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పీ–4 సర్వే వాల్ పోస్టర్లను జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ స్వయం సహాయక సంఘాల ద్వారా సైనిక వెల్ఫేర్ ఫండ్ కోసం సేకరించిన రూ.10.30 లక్షల చెక్కును డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఏపీఎం, ఏసీలు జాయింట్ కలెక్టర్‌కు అందజేశారు. డీఆర్‌ఓ జి.గంగాధర్ గౌడ్, బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, సర్వ శిక్ష అభియాన్ పీఓ నాగిరెడ్డి, డీపీఓ ప్రభాకర్, డీఆర్‌డీఏ పీడీ పద్మజ, డ్వామా పీడీ విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయమ్మ, జిల్లా రవాణాశాఖ అధికారి పరంధామరెడ్డి, డీఏఓ రామకృష్ణ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శివలీల, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment