రైతుల సంక్షేమం కోసం నాబార్డు కృషి | - | Sakshi
Sakshi News home page

రైతుల సంక్షేమం కోసం నాబార్డు కృషి

Published Wed, Mar 5 2025 2:30 AM | Last Updated on Wed, Mar 5 2025 2:29 AM

రైతుల సంక్షేమం కోసం నాబార్డు కృషి

రైతుల సంక్షేమం కోసం నాబార్డు కృషి

ఇంకొల్లు (చినగంజాం): కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నాబార్డు సంస్థ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు.. రైతుల అభివృద్ధికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని ఉమ్మడి ప్రకాశం జిల్లా నాబార్డు డీడీవో రవికుమార్‌ అన్నారు. మంగళవారం రోటరీ భవనంలో ఇంకొల్లు సంరక్షణ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ లిమిటెడ్‌ సంబంధించిన ఎఫ్‌ఎస్‌ సెంటర్‌ రైతులతో సమావేశం నిర్వహించారు. ఎఫ్‌ఈసీ సెంటర్‌ ఎండీ ఎం శ్రీనివాసబాబు, కార్యదర్శి జీ మంజూషా ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం వివిధ రకాల రాయితీలతో పాటు రైతులు వ్యాపారం చేసుకునేందుకు సరుకు నిల్వ చేసుకునే గోడౌను నిర్మించుకునేందుకు రుణాలు కూడా ఇప్పించటానికి నాబార్డు కృషి చేస్తున్నట్లు అన్నారు. రైతులు తమ పండించిన పంట ఉత్పత్తులు అమ్మకాల విషయంలో దళారీ వ్యవస్థతో నష్టపోతున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు నష్టపోకుండా తాము పండించిన పంట ఉత్పత్తులు సమష్టిగా కలిసి అమ్ముకునేందుకు నాబార్డు సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

జాతీయ సమావేశాలకు ఐదుగురికి ఆహ్వానం

సత్తెనపల్లి: అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో ప్రత్యేకత చాటుకున్న ఎంపీడీవో, గ్రామ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శిలకు ఈనెల 4, 5 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న జాతీయ సమావేశానికి ఆహ్వానం అందింది. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఎంపీడీవో జీ లక్ష్మీదేవి, గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెం గ్రామ సర్పంచ్‌ ఎం.లలితకుమారి, వెంగళాయపాలెం గ్రామ కార్యదర్శి వి.రవి, కొల్లిపర మండలం వల్లభాపురం సర్పంచ్‌ బి భ్రమరాంబ, పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామ సర్పంచ్‌ షేక్‌ గౌసియా బేగం స్నేహపూర్వక పంచాయతీల (ఉమెన్‌ ఫ్రెండ్లీ పంచాయతీ) పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను పంచాయతీలో అమలు చేస్తున్నారు. ఇందుకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి సమావేశాలకు వీరికి ఆహ్వానం అందడంతో సోమవారం పయనమై వెళ్లారు.

నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ

మంగళగిరిటౌన్‌: మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎగువ సన్నిధిలోని పానకాలస్వామి వారి ముఖ మండపంలో మంగళవారం భక్తులు నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. దేవస్థానం ప్రధాన అర్చకులు, గురుస్వామి మాల్యవంతం శ్రీనివాసదీక్షితులు భక్తులకు మాలవేసి దీక్ష ఇచ్చారు. స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్‌ అధ్యక్షులు తోట శ్రీనివాసరావు మాలధారణ దీక్ష స్వీకరించే భక్తులకు దీక్షా వస్త్రాలను ఉచితంగా అందజేశారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మంగళగిరి అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు, న్యాయవాది రంగిశెట్టి లక్ష్మి మాట్లాడారు. శివారెడ్డి గురుస్వామి, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులు గోగినేని వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్‌ ప్రతినిధి సైదా నాయక్‌, శివాలయం మాజీ ధర్మకర్త అన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి, భక్తబృందం ప్రతినిధులు బుర్రి సతీష్‌, హనుమంత నాయక్‌, మాదల గోపీ తదితరులు పాల్గొన్నారు.

హాల్‌టికెట్ల కలర్‌ ప్రింటవుట్‌ను అనుమతించం

డీఐఈఓ నీలావతిదేవి

నరసరావుపేటఈస్ట్‌: ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌టికెట్లను వైట్‌ పేపర్‌పై ప్రింటవుట్‌ తీసుకొని పరీక్ష కేంద్రాలకు రావాలని పల్నాడు జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి సోమవారం తెలిపారు. కొందరు విద్యార్థులు హాల్‌టికెట్లను కలర్‌ ప్రింట్‌లో తీసుకువస్తున్నారని, వాటిని అనుమతించటం లేదని పేర్కొన్నారు. ఈమేరకు ఇంటర్మీడియెట్‌ విద్యామండలి నుంచి ప్రత్యేక ఉత్తర్వులు అందినట్టు వివరించారు. విద్యార్థులు గమనించి తమ వెంట తెల్లకాగితంపై ప్రింట్‌ చేసిన హాల్‌టికెట్లతో హాజరు కావాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement