బండరాయి పడి కార్మికుడు మృతి
మార్టూరు: ఓ గ్రానైట్ కార్మికుడు పనిచేసే ఫ్యాక్టరీలోనే బండరాయి పడటంతో మృతి చెందిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి మార్టూరు సమీపంలో జరిగింది. వివరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన సంపత్ కుమార్ యాదవ్ (25 ) రాజుపాలెం డొంకలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస గ్రానైట్ ఫ్యాక్టరీలో క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి బండరాయిని కటింగ్ చేసే మిషన్ దగ్గర నిలబడి ఉన్న సంపత్ కుమార్ యాదవ్ పై ప్రమాదవశాత్తు బండరాయి దొర్లి పడింది. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మిషన్ ఆపరేటర్ సత్యేంద్ర సింగ్ ఫిర్యాదు మేరకు ఎస్సై సైదా కేసు నమోదు చేశారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం తర్వాత బుధవారం సాయంత్రం బంధువులకు సంపత్ కుమార్ యాదవ్ మృతదేహాన్ని అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment