పరీక్ష కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి
నిజాంపట్నం: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని డిప్యూటీ డీఈవో కేసనశెట్టి సురేష్ అన్నారు. ఈనెల 17వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో మండలంలో ఏర్పాటు చేసిన పలు పరీక్ష కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన బెంచీలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల ఆవరణంలో ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పాఠశాలకు 100 మీటర్ల వరకు ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈవోలు ఆర్.శోభాచంద్, జీ.శేషుగోపాలం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ డీఈవో సురేష్
Comments
Please login to add a commentAdd a comment