ప్రపంచ శాంతి కోసమే గుడారాల పండుగ
అమరావతి: ప్రభువైన ఏసుక్రీస్తుచే తేజరింపచేసి ప్రపంచంలోని మానవులందరి ఉజ్జీవం కోసం గుడారాల పండుగలో ప్రార్థనలు చేస్తున్నామని హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు, దైవజనులు ఫాస్టర్ అబ్రహం అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని హోసన్నా దయాక్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించే 48వ గుడారాల పండుగ రెండవ రోజు రాత్రిపూట ప్రార్థనలకు వచ్చిన లక్షలాది మంది ఆరాధికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఈ పండుగలో విశ్వాసులు, సేవకులు ఉజ్జీవింపబడాలంటే దేవుని చేత ప్రకాశించి, వాక్యం మీద ఆసక్తి కలిగి దేవుని ప్రార్థనే ఊపిరిగా భావించాలన్నారు. దేవున్ని స్తుతించకుండా, ఆరాధించకుండా ఉండలేననే స్థితికి మనం చేరుకోవాలన్నారు. తాను కూడా అనేకులను ప్రభువు చెంతకు చేర్చటానికి సారధిగా మారాలనే సంకల్పం ఉండాలన్నారు. దేవుని యందు విశ్వాసంతో మనం పనిచేయగలిగితే జనులు కూడా నిన్ను అనుసరిస్తారు, అందుకు దైవజనులు ఏసన్న జీవితమే సాక్ష్యమన్నారు. 48 సంవత్సరాల కిందట కేవలం 80 మందితో నిర్వహించిన గుడారాల పండుగకు అదే గ్రామంలో నేడు లక్షలాదిమంది తరలిరావడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. వసతులు ఉన్నా, లేకపోయినా, అవకాశం ఉన్నా లేకపోయినా లక్షలాది మంది ఈ దయాక్షేత్రానికి రావడానికి కారణమైన ఏసుప్రభు చూపిన మార్గంలో మనందరి నడిపిన దైవజనులు ఏసన్న కారణజన్ముడన్నారు. దేవుని కృప నీపై ప్రసరించబడిన ఈరోజు నుంచి ప్రతి ఒక్కని జీవితంలో సర్వసమృద్ధి కలుగుతుందన్నారు. దేవుడు తనని నమ్మినవారందరిని ఒకరి వద్ద చేతుల చాచే స్థితిలో లేకుండా అదృష్టాన్ని ప్రసాందించబోతున్నారన్నారు. దేవుని అనుగ్రహం పొందినవారిని తృణీకరించిన వారందరూ సాగిలపడతారన్నారు. అనంతరం రెండవ వర్తమానంలో హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ పాస్టర్ జాన్‌వెస్లీ ప్రసంగించారు. తొలుత దేవుని స్తుతి గీతాలకు సండేస్కూల్ చిన్నారుల నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. సుపీరియర్ సిస్టర్ ప్రేమ ఆధ్వర్యంలో దేవని గీతాలాపనలు విశ్వాసులను భక్తిభావంలో ఓలలాడించాయి. ఈ ప్రార్థనలలో దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాదిమంది హోసన్నా ఆరాధికులు పాల్గొన్నారు.
ఫాస్టర్ అబ్రహం తరలివచ్చిన విశ్వాసులు
ప్రపంచ శాంతి కోసమే గుడారాల పండుగ
Comments
Please login to add a commentAdd a comment