అపరాల రైతులు పేర్లు నమోదు తప్పనిసరి
జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ కరుణశ్రీ
చెరుకుపల్లి: అపరాలు అమ్ముకునే రైతులు ముందుగా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని బాపట్ల జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ కె. కరుణశ్రీ సూచించారు. ఆమె శుక్రవారం మండల వ్యవసాయాధికారులతో కలసి ఆరుంబాక, గూడవల్లి, నడింపల్లి గ్రామాల్లో పర్యటించారు. పెసర పంట దిగుబడులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రబీ సీజన్‌లో బాపట్ల జిల్లాలో 58,790 హెక్టార్లలో రైతులు అపరాల సాగు చేశారని వెల్లడించారు. ఇందులో శనగలు 15,657 హెక్టార్లు, మినుములు 21,109 హెక్టార్లు, పెసలు 7,405 హెక్టార్లలో సాగు చేసినట్లు వివరించారు. శనగలను క్వింటా రూ. 5,650, మినుములు రూ. 7,400, పెసలు రూ. 8,682 చొప్పున రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేస్తారని ఆమె తెలిపారు. రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె రైతులకు సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అవ్వారు మహేష్ బాబు, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment