మహిళలు ధైర్యంగా మెలగాలి
నగరంపాలెం(గంటూరు వెస్ట్): అన్ని వేళల్లో మహిళలు ధైర్యంగా ఉండాలని జిల్లా ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం) అన్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం పోలీస్ కవాతు మైదానంలో ఓపెన్‌హౌస్ నిర్వహించారు. జిల్లా ఏఎస్పీ సుప్రజ మాట్లాడుతూ మహిళలు తమ లక్ష్యాలను ఛేదించాలని అన్నారు. తద్వారా నలుగురికి ఆదర్శంగా నిలవాలని చెప్పారు. సీ్త్రలు లేనిదే జననం లేదని పేర్కొన్నారు. అనంతరం విద్యార్ధినీలకు ఆయుధాల పనితీరుపై మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ సుబ్బారావు, సిబ్బంది అవగాహన కల్పించారు. కొత్తపేట పీఎస్ పరిధిలోని శ్రీజలగం రామా రావు మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో మహిళా సాధికారత ర్యాలీ, పాతగుంటూరు పీఎస్ పరిధిలోని యాదవ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, ఎస్‌ఐలు రమేష్ (కొత్తపేట పీఎస్), వెంకటేశ్వర్లు (పాతగుంటూరు పీఎస్) పాల్గొన్నారు.
జిల్లా ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం)
Comments
Please login to add a commentAdd a comment