సబ్ జూనియర్స్ కబడ్డీ పోటీలకు గాయత్రి ఎంపిక
వేటపాలెం: స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలకు విద్యార్థిని గాయత్రి జిల్లా కబడ్డీ సబ్ జూనియర్స్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం ఫణి సత్యనారాయణ సోమవారం తెలిపారు. ఆదివారం ఒంగోలు మినీ స్టేడియంలో ప్రకాశం ఉమ్మడి జిల్లా కబడ్డీ సబ్ జూనియర్స్ బాలబాలికల ఎంపిక నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీల్లో హైస్కూలు ఎనిమిదో తరగతి విద్యార్థిని గాయత్రి ఎంపికై నట్లు చెప్పారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు జరిగే సబ్ జూనియర్స్ టోర్నమెంట్‌లో ఆమె పాల్గొంటుందని తెలిపారు. విద్యార్థినిని పీడీ ఎం. కోటేశ్వరమ్మ, ఉపాధ్యాయురాలు జె. శ్రీవాణి అభినందించారు.
చేతివృత్తులకు నైపుణ్య శిక్షణ
నరసరావుపేట ఈస్ట్: చేతి వృత్తులకు సంబంధించి అత్యాధునిక నైపుణ్య శిక్షణను పొందటం ద్వారా ఉద్యోగ, ఉపాధి పనులలో గొప్ప స్థాయికి వెళ్లగలరని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఇ.తమ్మాజీరావు తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ చేతివృత్తుల వారికి అత్యుత్తమ శిక్షణను అందిస్తున్నట్టు వివరించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ చేతివృత్తి కోర్సు పధకం ద్వారా సింక్రో సర్వ్ గ్లోబల్ సెల్యూషన్స్ ద్వారా శిక్షణ పొందిన వారికి సోమవారం సర్టిఫికెట్లు అందచేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న తమ్మాజీరావు మాట్లాడుతూ, పదవ తరగతి, ఇంటర్మీడియేట్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ఐఓటీ, పైథాన్, డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్, బేసిక్ కంప్యూటర్ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇస్తామని, ఉద్యోగ, ఉపాధి కల్పనలో సహరిస్తామని స్పష్టం చేశారు. ఆసక్తి గలవారు 6301851503, 6301851504 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment