
కబడ్డీ జట్టుకు అభినందనలు
చినగంజాం: జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే సబ్ జూనియర్ పురుషుల రాష్ట్ర జట్టు క్రీడాకారులను వైఎస్సార్ సీపీ మండల నాయకులు శనివారం అభినందించారు. స్థానిక కొత్తపాలెం బాలకోటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న శిబిరంలో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులను వారు కలిసి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ మున్నం నాగేశ్వరరెడ్డి, ఎన్. సుబ్బారెడ్డి, ఎన్. రామిరెడ్డి, రాజు వెంకటేశ్వరరెడ్డి, బొడ్డు ఏడుకొండలరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, మేడికొండ సునీల్, సూర్యనారాయణరెడ్డి, పాదర్తి ప్రకాష్, మార్కాపురం రామారావు, ఆట్ల పోతురాజు, శ్రీకాంత్, కోటిరెడ్డి, స్వామిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment