
మత్స్య సంపద, ఆక్వా సాగు పెంచేందుకు చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర కమిషనర్ రమాశంకర్‌నాయక్
బాపట్ల: మత్స్య సంపద, ఆక్వా సాగు పెంచడమే ప్రభుత్వం ముఖ్యోద్దేశమని మత్స్య శాఖ రాష్ట్ర కమిషనర్ రమాశంకర్‌నాయక్ అన్నారు. బాపట్ల జిల్లా పర్యటనకు వచ్చిన కమిషనర్ రమాశంకర్‌నాయక్ స్థానిక కలెక్టరేట్‌కు శనివారం చేరుకున్నారు. జిల్లాకు తొలిసారిగా వచ్చిన కమిషనర్‌ను జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. కమిషనర్‌ను కలిసిన వారిలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ ఉన్నారు. అనంతరం బాపట్ల, చీరాలలోని రొయ్యల హేచరీలు, పాలీ చీట్ యూనిట్లు, బయోఫ్లోక్ టెక్నాలజీతో నడిచే యూనిట్లు, రొయ్యల ఫామ్, ప్రాసెసింగ్ యూనిట్లను ఆయన పరిశీలించారు. ఆయన వెంట జిల్లా మత్స్యశాఖ సహాయ సంచాలకులు బి కృష్ణకిషోర్, మత్స్యశాఖ అధికారులు, ఆక్వా చెరువులు, ప్రాసెసింగ్ యూనిట్ల నాయకులు, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment