● అసైన్డ్‌ భూముల్లో అక్రమంగా రిసార్ట్‌లు ● సీఆర్‌జెడ్‌ నిబంధనలకు తిలోదకాలు ● తీర ప్రాంతాన్ని చెరబట్టిన పచ్చ నేతలు ● గెస్ట్‌హౌస్‌లూ నిర్మిస్తున్న అక్రమార్కులు ● మామూళ్ల మత్తులో అధికారులు ● ఇప్పటికే 40కిపైగా రిసార్ట్‌ల నిర్మాణం ● నిర్మాణంలో మరో 35 రిసార్ట్‌ | - | Sakshi
Sakshi News home page

● అసైన్డ్‌ భూముల్లో అక్రమంగా రిసార్ట్‌లు ● సీఆర్‌జెడ్‌ నిబంధనలకు తిలోదకాలు ● తీర ప్రాంతాన్ని చెరబట్టిన పచ్చ నేతలు ● గెస్ట్‌హౌస్‌లూ నిర్మిస్తున్న అక్రమార్కులు ● మామూళ్ల మత్తులో అధికారులు ● ఇప్పటికే 40కిపైగా రిసార్ట్‌ల నిర్మాణం ● నిర్మాణంలో మరో 35 రిసార్ట్‌

Published Mon, Mar 24 2025 2:34 AM | Last Updated on Mon, Mar 24 2025 2:33 AM

● అసై

● అసైన్డ్‌ భూముల్లో అక్రమంగా రిసార్ట్‌లు ● సీఆర్‌జెడ్‌

సాక్షి ప్రతినిధి, బాపట్ల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలోని చీరాల తీరప్రాంతంలో అక్రమ నిర్మాణాలు మరింతగా పెరిగాయి. బాపట్లలోని సూర్యలంక, చీరాల పరిధిలోని ఓడరేవు, రామాపురం బీచ్‌లకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం పర్యాటకులు వస్తుంటారు. వారాంతంలో వీరి సంఖ్య లక్షల వరకు ఉంటోంది. దీంతో ఇక్కడ గెస్ట్‌హౌస్‌లు, రిసార్ట్‌లకు డిమాండ్‌ పెరిగింది. ఇదే అవకాశంగా స్థానికులతోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు సైతం తీరంలో స్థలాలు కొని రిసార్ట్‌ల నిర్మాణానికి పూనుకొన్నారు.

ఆకాశాన్నంటేలా భూముల ధరలు

గతంలో తీరంలో ఎకరం రూ. 20 లక్షల నుంచి రూ.30 లక్షలలోపు ఉండేది. నేడు రూ. 3 కోట్ల వరకు పలుకుతోంది. ఇదే అవకాశంగా ఇక్కడ అధికంగా ఉన్న ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను స్థానిక పచ్చ నేతలు, కొందరు అధికారులు కలిసి అమ్మకానికి పెట్టి రూ. రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. వేటపాలెం మండలం రామాపురం, కటారివారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం తదితర గ్రామాల పరిధిలోని తీరప్రాంతంలో వారు స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. మరికొంత ఈ భూములు పక్కనున్న ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను ఆక్రమించి రిసార్ట్‌లు, గెస్ట్‌హౌస్‌లు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 40కి పైగా రిసార్ట్‌లు ఉండగా, ప్రస్తుతం 35 రిసార్ట్‌ల నిర్మాణం వేగంగా సాగుతోంది.

పచ్చ నేతకు ఎకరానికి రూ. 20 లక్షలు

రెండు రిసార్ట్‌లకు మాత్రమే అనుమతులున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొత్తగా వెలుస్తున్న వాటికి అనుమతులే లేవు. ఈ ప్రాంతానికి చెందిన పచ్చ నేత ఎకరానికి రూ. 20 లక్షలు తీసుకొని అనధికార అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రియల్‌ వెంచర్లకు ఎకరానికి రూ.10 లక్షలు తీసుకుంటున్న ఆయన.. రిసార్ట్‌లకు మాత్రం రెండింతలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక్కడ ఎలాంటి నిర్మాణానికై నా భూ బదలాయింపు జరగాలి. తర్వాత నిర్మాణానికి సంబంధించిన ప్లాన్‌కు పంచాయతీ అప్రూవల్‌ ఉండాలి. విద్యుత్‌ మీటర్‌ ఏర్పాటుకు పంచాయతీ సెక్రటరీ నుంచి నో అబ్జక్షన్‌ తీసుకోవాలి. ఇవేవీ లేకుండానే అధికారులకు ముడుపులు ముట్టజెప్పి రిసార్ట్‌లు నిర్మిస్తున్నారు. అక్రమ నిర్మాణాల్లో 50 శాతం అసైన్డ్‌ ల్యాండ్‌ ఉండడంతో కన్వర్షన్‌కు అవకాశం లేకుండా పోయింది.

సీఆర్‌జెడ్‌ నిబంధనలు గాలికి..

కూటమి అధికారంలోకి రాగానే బాపట్ల జిల్లా పచ్చ నేతలు తమ అక్రమాలు రీస్టార్ట్‌ చేశారు. జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను పచ్చ నేతలు విక్రయానికి పెట్టి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. దీంతోపాటు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు అందిన కాడికి దండుకొని మౌనంగా ఉంటున్నారు. రిసార్ట్‌ల పేరుతో స్థలాలు కొనుగోలు చేస్తున్న నేతలు పక్కనున్న ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను ఆక్రమిస్తున్నారు.

సీఆర్‌జెడ్‌ (కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌) నిబంధనల మేరకు సముద్ర తీరానికి 500 మీటర్ల లోపు మత్స్యకార గ్రామాలు, మత్స్యకారులు, వారి ఆస్తులు, ఫిషింగ్‌ జెట్టీలు, ఐస్‌ ప్లాంట్లు, పిష్‌ డ్రైయింగ్‌ ప్లాట్‌ఫారాలు, పాఠశాలలు, పారిశుద్ధ్యం వంటి ఇతర వసతుల కల్పన కార్యక్రమాలు మినహా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టరాదు. ప్రధానంగా తీరంలో రిసార్ట్‌లు, గెస్ట్‌హౌస్‌లు, లాడ్జీలు, హోటళ్లు లాంటివి అసలు నిర్మించరాదు. కానీ ఇవేమీ ఇక్కడ అమలు కావడం లేదు. ఇక ఇక్కడ పనిచేస్తున్న ఒక రెవెన్యూ అధికారి గతంలో తాను పనిచేసిన మండలం నుంచి కొందరు పంచాయతీ సెక్రటరీలు, ఇతర రెవెన్యూ సిబ్బంది ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. చీరాల ఆర్డీవోగా ఉన్న సూర్యనారాయణరెడ్డి ఎన్నికల ముందు ఇక్కడి అక్రమాలపై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేశారు. అప్పటి జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో అక్రమ నిర్మాణదారులకు నోటీసులు కూడా జారీ అయ్యాయి. కూటమి అధికారంలోకి రావడంతో ఆ ఆర్డీవోను పచ్చ నేత బదిలీ చేయించారు. తర్వాత వచ్చిన ఆర్డీవో చంద్రశేఖర నాయుడు ఒక అక్రమ నిర్మాణాన్ని తొలగించి, మిగిలిన వారికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. పచ్చనేత ద్వారా ఆర్డీవోపై ఒత్తిడి రావడంతో ఆక్రమణల తొలగింపు వ్యవహారం తాత్కాలికంగా వాయిదా పడినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
● అసైన్డ్‌ భూముల్లో అక్రమంగా రిసార్ట్‌లు ● సీఆర్‌జెడ్‌ 1
1/3

● అసైన్డ్‌ భూముల్లో అక్రమంగా రిసార్ట్‌లు ● సీఆర్‌జెడ్‌

● అసైన్డ్‌ భూముల్లో అక్రమంగా రిసార్ట్‌లు ● సీఆర్‌జెడ్‌ 2
2/3

● అసైన్డ్‌ భూముల్లో అక్రమంగా రిసార్ట్‌లు ● సీఆర్‌జెడ్‌

● అసైన్డ్‌ భూముల్లో అక్రమంగా రిసార్ట్‌లు ● సీఆర్‌జెడ్‌ 3
3/3

● అసైన్డ్‌ భూముల్లో అక్రమంగా రిసార్ట్‌లు ● సీఆర్‌జెడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement