
ఇద్దరు మావోయిస్టులు లొంగుబాటు
కొత్తగూడెంటౌన్: నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు మడవి ఉంగ, ఏఓబీ కట్ ఆఫ్ ఏరియా కమిటీ సభ్యురాలు మడకం సుక్కిలు శనివారం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఎస్పీ రోహిత్‌రాజు కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు గ్రామపంచాయతీ పాలగూడెం గ్రామానికి చెందిన మడవి ఉంగ అలియాస్ నగేష్ కలిమెల ఏరియా కమిటీ ఏసీఎంగా పనిచేస్తున్నాడు. బీజాపూర్ జిల్లా టెర్రాం పీఎస్ పరిధికి చెందిన మడకం సుక్కి అలియాస్ రోషిణి కట్ ఆఫ్ ఏరియా కమిటీ సభ్యురాలుగా పనిచేస్తోంది. మడవి ఉంగ 2015 నుంచి మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిలో పనిచేస్తున్నాడు. 2018లో మావోయిస్టుల్లో చేరిన మడకం సుక్కి అలియాస్ రోషిణి 2021 నుంచి ఏఓబీ కట్ ఆఫ్ ఏరియా కమిటీలో పని చేస్తోంది. వీరిద్దరూ పలు విధ్వంసకర సంఘటనల్లో పాల్గొనగా, ఉంగపై రూ.4 లక్షల రివార్డు ఉందని ఎస్పీ తెలిపారు. సాధారణ జీవితం గడపాలనుకునే మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఎస్పీ కోరారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ పరితోష్ పంకజ్, మణుగూరు డీఏస్పీ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment