
వీల్‌చైర్ క్రికెట్ క్రీడాకారులను అభినందించిన ఎంపీ
ఖమ్మంవన్‌టౌన్: నేషనల్ వీల్‌చైర్ క్రికెట్ టోర్నీ లో ప్రతిభ చాటిన జిల్లా క్రీడాకారులను ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి శనివారం అభినందించారు. జిల్లాకు చెందిన ఎస్.కే.సమీరుద్దీ న్, బండి రాము, సురేష్, రమావత్ కోటేశ్వర్, మహ్మద్ సమీ జట్టు విజయానికి తోడ్పడ్డారు. ఈ సందర్భంగా వారిని ఎంపీ ఖమ్మంలో సన్మానించగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారా యణ, పాపానాయక్ పాల్గొన్నారు.
పార్లమెంట్‌లో గళం విప్పుతా..
ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ పనులకు నిధులు కేటాయించేలా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఎంపీల సమావేశం జరగగా ఆయన మాట్లాడారు. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు, పాలేరు నియోజకవర్గం మీదుగా వెళ్లే రైల్వేలైన్ అలైన్‌మెంట్ మార్పు, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారులు, ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరనున్నట్లు తెలిపారు.
కొండ గొర్రె మాంసం పట్టివేత
గుండాల: వేటగాళ్లకు కొండ గొర్రె మాంసాన్ని పంచుకుంటుండగా పట్టుకొని కేసు నమోదు చేశామని అటవీశాఖాధికారులు శనివారం తెలిపారు. చింతలపాడు గ్రామానికి చెందిన ఇద్దరు చేపల వేటకు వెళ్లగా కుక్కలు ఓ కొండ గొర్రెను వేటాడాయి. ఆ మాంసాన్ని తెచ్చుకున్న ఇద్దరు అటవీ శాఖ అధికారులకు పట్టుబడ్డారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించామని అటవీశాఖ అధికారులు నరసింహారావు, బాలాజీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment