
రామాలయానికి ఈ–స్కానర్లు బహూకరణ
భద్రాచలంఅర్బన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానానికి శనివారం ఎస్‌బీఐ రామాలయం శాఖ మూడు ఈ–కానుక స్కానర్లను బహూకరించింది. ఈ కార్యక్రమంలో భద్రాచలం దేవస్థానం ఏఈఓ శ్రావణ్ కుమార్, దేవస్థానం ఈఓ సీసీ శ్రీనివాసరెడ్డి, ఎస్‌బీఐ ఆర్‌ఎం సత్యనారాయణ, మేనేజర్ మధుసూదన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
నాలుగు రోజుల్లో
కుమార్తె వివాహం
● గుండెపోటుతో తండ్రి మృతి
పాల్వంచరూరల్: మరో నాలుగు రోజుల్లో కుమార్తె వివాహం ఉండగానే అంతలోనే రైతు గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మండలంలోని మొండికట్ట గ్రామానికి చెందిన రైతు, సొసైటీ మాజీ డైరెక్టర్ చిల్లా వెంకన్న (50) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య పుణమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమార్తె వివాహానికి సంబంధించిన శుభలేఖలు పంపిణీ చేసి, ఇంటికి వచ్చి రాత్రి ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు. కొత్వాల శ్రీనివాసరావు, యర్రంశెట్టి ముత్తయ్య, రౌతు రామారావు, అంబేడ్కర్, మోహన్‌రావు తదితరులు వెంకన్న మృతదేహాన్ని సందర్శించారు.
రేషన్ బియ్యం పట్టివేత
టేకులపల్లి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని శనివారం స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ సురేశ్ కథనం ప్రకారం.. మండలానికి చెందిన భూక్య లాలు మండల కేంద్రంలోని బోడబజారు నుంచి బొలేరో వాహనంలో రేషన్ బియ్యం తరలిస్తున్నాడనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వాహనంలో 34.20 క్వింటాళ్ల బియ్యం ఉండటంతో వాటిని పౌరసరఫరాలశాఖ డీటీకి అప్పగించారు. భూక్య లాలు, డ్రైవర్ లచ్చిరాంపై కేసు నమోదు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ వివరించారు.

రామాలయానికి ఈ–స్కానర్లు బహూకరణ
Comments
Please login to add a commentAdd a comment