క్రీడాకారిణి సింధుకు కలెక్టర్ సన్మానం
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లో ఈనెల 9న జరిగిన జాతీయస్థాయి క్రీడా పోటీల్లో అధ్లెటిక్ విభాగంలో జిల్లాకు చెందిన మాళోత్ సింధు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. కాగా సింధును కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం తన చాంబర్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని అన్నారు. జాతీయస్థాయిలో జిల్లాకు గుర్తింపు తెచ్చిన సింధుకు రూ.25 వేల చెక్కు అందజేశారు. జాతీయ క్రీడల్లో రాణించడానికి ప్రోత్సహించిన కోచ్ నరేష్, సిఽంధు తండ్రి మాళోత్ లక్ష్మణ్‌ను అభినందించారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ ఎం.పరంధామరెడ్డి, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ మహీధర్, జాయింట్ సెక్రటరీ మల్లికార్జున్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, న్యూస్టార్ క్లబ్ ప్రెసిడెంట్ ఎండి బాబ్జి, క్రీడా కార్యాలయ సిబ్బంది తిరుమలరావు పాల్గొన్నారు.
సర్వే నమోదుకు నేటి నుంచి మరో చాన్స్
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో నమోదు చేసుకోని కుటుంబాలకు ఈనెల 16 నుంచి 28 వరకు మరో అవకాశం కల్పించినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ పెద్ద ఎవరైనా టోల్ ఫ్రీ నంబర్ 040–21111111కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఫోన్ చేసి నమోదు చేసుకోవచ్చని తెలిపారు. మున్సిపాలిటీ, మండల పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వెబ్‌సైట్ ద్వారా సర్వే ఫాం డౌన్‌లోడ్ చేసుకుని పూర్తిచేసి ప్రజాపాలన సేవా కేంద్రాల్లో అందజేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment