కొత్తగూడెంటౌన్: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో ఈనెల 18న ముగిసిన రాష్ట్రస్థాయి యూత్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. జిల్లా నుంచి 30 మంది క్రీడాకారులు పాల్గొనగా 12 మంది పతకాలు సాధించారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ కె.మహిధర్ బుధవారం వెల్లడించారు. కరకగూడేనికి చెందిన తోలెం శ్రీతేజ హైజంప్ 400 మీటర్ల విభాగంలో రెండు బంగారు పతకాలు, కాచనపల్లికి చెందిన వై.శృతిహాసన్ ట్రైత్‌లాన్‌లో బంగారు పతకం, కొత్తగూడేనికి చెందిన జుర్పుల దీక్షిత్ 100 మీటర్ల విభాగంలో బంగారు పతకం, 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకం, కె.దిలీప్ ట్రైత్‌లాన్‌లో రజత పతకం, డిస్కస్‌త్రోలో టి.చంద్రకళ రజత, జావెలిన్ త్రోలో బి.వేదశ్రీ రజత పతకాలు సాధించారని పేర్కొన్నారు. భద్రాచలానికి చెందిన షేక్ అమ్రీన్ జావెలిన్‌త్రోలో రజత, కాచనపల్లికి చెందిన బి.ప్రసన్ లాంగ్‌జంప్‌లో రజత పతకం, ట్రైత్‌లాన్‌లో ఆర్.వైష్టవి కాంస్య పతకం సాధించారని వివరించారు. క్రీడాకారులను డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు యుగంధర్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకృష్ణ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment