‘ఉపాధి’ని సద్వినియోగం చేసుకోవాలి
చుంచుపల్లి: జాబ్‌కార్డు ఉన్న ప్రతీ ఒక్కరు వేసవి కాలంలో ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఓ ఎం.విద్యాచందన అన్నా రు. మండలంలోని నందతండాలో గురువారం ఆమె ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ.. నాలుగు నెలల పాటు గ్రామాల్లో ఈజీఎస్ పనులు ఎక్కువగా జరుగుతాయని, ప్రతి కూలీకి చేతినిండా పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఉపాధి హామీ పనుల వద్ద కూలీలకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించాలని సిబ్బందికి సూచించారు. కూ లీల హాజరు, కొలతలు వంటివి కచ్చితంగా పాటించాలన్నారు. ఎండలు పెరుగుతున్నందున పని ప్రదేశంలో నీడ, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఆమె వెంట ఎంపీడీఓ సుభాషిని, టీఏ నాగరాజు తదితరులు ఉన్నారు.
డీఆర్‌డీఓ విద్యాచందన
Comments
Please login to add a commentAdd a comment