అపార్ ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తిచేయండి
బూర్గంపాడు: విద్యార్థుల అపార్ ఐడీ ఆన్‌లైన్ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని డీఈఓ వెంకటేశ్వరాచారి అన్నారు. మండలంలోని ఉప్పుసాక గిరిజన ఆశ్రమ పాఠశాలను, బూర్గంపాడులోని టీఎస్‌ఆర్‌ఎస్(బాలికల)పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఉప్పుసాకలో విద్యార్థుల అపార్ ఐడీ ఆన్‌లైన్ ప్రక్రియ వెనుకబడి ఉండటాన్ని గుర్తించి ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎండల తీవ్రత పెరుగుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. బూర్గంపాడు టీఎస్‌ఆర్‌సీలో విద్యార్థులతో మాట్లాడి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు సతీష్, నాగరాజశేఖర్, సైదులు పాల్గొన్నారు.
విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచాలి
అశ్వాపురం: విద్యార్థుల పఠనా సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి అన్నారు. మండలంలోని మిట్టగూడెం జెడ్పీ పాఠశాలలో బుధవారం నిర్వహించిన ఎఫ్‌ఎల్‌ఎన్ బాలమేళా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మిట్టగూడెం కాంప్లెక్స్ పరిధిలోని 15 పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొనగా.. పాఠశాలల వారీగా విద్యార్థులు టీఎల్‌ఎం నమూనాలు ప్రదర్శించారు. వాటిని పరిశీలించిన డీఈఓ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఎఫ్‌ఎల్‌ఎన్ బాలమేళా కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పారు. మారుమూల ప్రాంత పాఠశాలలు మిగతా మండలాల వారికి ఆదర్శంగా ఉంటడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఎఫ్‌ఎల్‌ఎం బాలమేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. పాఠశాల హెచ్‌ఎం వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ వెంకటేశ్వరాచారి
Comments
Please login to add a commentAdd a comment