కేసులు త్వరగా పరిష్కరించాలి
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదిర్శి భానుమతి
కొత్తగూడెంటౌన్: జాతీయ లోక్ అదాలత్‌తో త్వరితగతిన కేసుల పరిష్కారం కోసం కృషి చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి అన్నారు. బుధవారం జిల్లా కోర్టు లైబ్రరీ హాల్‌లో న్యాయవాదులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీమా కంపెనీలు తమ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. మోటార్ వాహన ప్రమాద బాధితుల కేసుల్లో కక్షిదారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. లోక్ అదాలత్‌లో రాజీపడితే కక్షిదారులకు సమయం, డబ్బు వృథా కాకుండా ఉంటాయన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, న్యాయవాది రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment