కేటీపీఎస్ కాల్వలో మొసలి
పాల్వంచరూరల్ : పది రోజుల వ్యవధిలోనే కేటీపీఎస్ కాల్వలో రెండు మొసళ్లు కనిపించడంతో పర్యాటకులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు కూడా మొసళ్లను చూసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పర్యాటక ప్రాంతమైన కిన్నెరసాని జలాశయం నుంచి కేటీపీఎస్ విద్యుత్ కర్మాగారానికి నీరు సరఫరా అయ్యే కాల్వలో మంగళవారం మరో మొసలి కనిపించింది. దాన్ని చూసిన పర్యాటకులు భయపడి అక్కడి నుంచి పరుగెత్తారు. అధికారులు వెంటనే స్పందించి కేటీపీఎస్ కాల్వలో సంచరిస్తున్న మొసలిని పట్టుకుని ఇతర ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment