మనస్థాపంతో వృద్ధుడి ఆత్మహత్య
టేకులపల్లి: ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సోమవారం కేసు నమోదైంది. టేకులపల్లి ఎస్‌ఐ పోగుల సురేష్ కథనం ప్రకారం.. మండలంలోని మద్రాస్‌తండా గ్రామానికి చెందిన బాదావత్ చిన్న లక్ష్మా (60) భార్య నాలుగేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి మనోవేదనకు గురవుతున్నాడు. ఆదివారం ఉదయం పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతకగా పొలం వద్ద పురుగుల మందు తాగి మృతి చెంది ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మద్యం మత్తులో మరొకరు...
దమ్మపేట: భార్య మందలించిందనే కారణంగా మద్యం మత్తులో ఓ వ్యక్తి సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... దమ్మపేట గ్రామానికి చెందిన పాండ్ల నాగరాజు(42) మద్యానికి బానిసగా మారి ఏ పనీ చేయకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో భార్య సత్యావతి మందలించింది. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అదనపు ఎస్సై బాలస్వామి తెలిపారు.
పేకాట శిబిరంపై దాడి
దమ్మపేట: మండల పరిధిలోని మొద్దులగూడెం శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, రూ.2,500 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఏఎస్సై బాలస్వామి తెలిపారు.
అత్యాచార యత్నం
ఇల్లెందు: అత్యాచారానికి యత్నించిన వ్యక్తిపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నెహ్రూనగర్ గ్రామానికి చెందిన భూక్య సునీతపై అదే గ్రామానికి చెందిన నాగరాజు ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
బియ్యం లారీ సీజ్
అశ్వాపురం: మణుగూరు నుంచి పాల్వంచ వైపు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని సోమవారం పోలీసులు పట్టుకున్నారు. సీఐ అశోక్‌రెడ్డి, పోలీస్ సిబ్బందితో ప్రత్యేక నిఘా పెట్టి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ఎదుట బియ్యం తరలిస్తున్న లారీని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లారీలో సుమారు 180 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్టు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment