రేపు దివ్యాంగుల ఉపకరణాలు పంపిణీ
కొత్తగూడెంఅర్బన్: దివ్యాంగ విద్యార్థులకు ఈ నెల 19న సహాయ ఉపకరణాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తన్నట్లు సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ ఎస్‌కే సైదులు తెలిపారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమగ్ర శిక్షా, ఆర్టిఫిషియల్ లింబ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో గతేడాది ఆగస్టులో ప్రత్యేక శిబిరం నిర్వహించి, 288 మంది అర్హులను గుర్తించినట్లు పేర్కొన్నారు. వారికి ఈ నెల 19న కొత్తగూడెంలోని ఆనందఖని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ చేతుల మీదుగా ఉపకరణాలు పంపిణీ చేస్తామని తలెఇపారు. ఎంపికై న అభ్యర్థులు రెండు ఫొటోలు, సదరం ధ్రువపత్రం, పాఠశాల హెచ్‌ఎం, ఎంఈఓ ధ్రువీకరణతో ప్రభుత్వ వైద్యుడి నుంచి తీసుకున్న మెడికల్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు జిరాక్స్ తీసుకుని రావాలని కోరారు. బ్రెయిలీ కిట్లు–13, హియరింగ్ ఎయిడ్–33, వీల్‌చైర్లు–76, ఎంఆర్ కిట్లు–96, ట్రైసైకిళ్లు–16, రోలెటర్లు–29, కాలిఫర్స్–23, బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ ట్రైసైకిల్–2, ఇతరాలు–64 పంపిణీ చేస్తారని ఆయన వివరించారు. సమావేశంలో హెచ్‌ఎం మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment