ఏడాదిలో 290 సెల్‌ఫోన్ల రికవరీ
ఖమ్మం క్రైం: సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వారు సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తుండగా, ఐటీ సెల్ బృందం ట్రాక్ చేశాక స్వాధీనం చేసుకుని బాధితులకు అందిస్తున్నామని ఖమ్మం అదనపు డీసీపీ నరేష్‌కుమార్ తెలిపారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో రూ.7లక్షల విలువైన 48 ఫోన్లను యజమానులకు ఆయన అందజేసి మాట్లాడారు. ఇందులో రూ.10వేలు మొదలు రూ.1.50 లక్షల విలువైన ఫోన్లు ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 680 ఫోన్లు పోగొట్టుకున్నట్లు పోర్టల్‌లో నమోదు కాగా 582ఫోన్లను గుర్తించి, 290 ఫోన్లు రికవరీ చేశామని చెప్పారు. ఇందులో కీలకంగా వ్యవహరించిన ఐటీ సెల్ నోడల్ ఆఫీసర్, ఏసీపీ వెంకటేశ్, ఎస్సై సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ హేమనాధ్, కానిస్టేబుళ్లు నరేష్, శ్రీనును కమిషనర్, అదనపు కమిషనర్ అభినందించారు.
ఖమ్మం అదనపు డీసీపీ నరేష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment