సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి
మణుగూరు టౌన్: మున్సిపాలిటీలోని పీకే–1 ఇంక్‌లైన్ ఏరియాలో నిర్మిస్తున్న సెల్ టవర్‌ను నిలిపివేయాలని స్థానికులు సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇప్పటికే బీటీపీఎస్, సింగరేణి, సోలార్ ప్లాంట్, హెచ్‌డబ్ల్యూపీ(ఎం) పరిశ్రమల కారణంగా అధిక కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని, దీనికితోడు సెల్ టవర్ నిర్మిస్తే రేడియేషన్ ప్రభావంతో అనారోగ్యం పాలవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణం సీసా చట్టం, గిరిజన హక్కులకు వ్యతిరేకంగా జరుగుతోందని ఆరోపించారు.
రాష్ట్ర మానవ హక్కుల
కమిషన్‌కు వినతి
Comments
Please login to add a commentAdd a comment