మణుగూరు టౌన్: బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు సమష్టిగా కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్(పీపీ, పా) కొప్పుల వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మణుగూరులో పర్యటించిన ఆయన ఏరియా జీఎం దుర్గం రాంచందర్‌తో కలిసి వ్యూ పాయింట్ నుంచి ఓసీ–2లో బొగ్గు వెలికితీతను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 22 నాటికి 100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం అభినందనీయమని అన్నారు. యూనియన్ల నాయకులు, అధికారులు, కార్మికుల కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తి కొనసాగించాలని సూచించారు. తొలుత జీఎం కార్యాలయంలో డైరెక్టర్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్యాంసుందర్, ఆర్.శ్రీనివాస్, వీరభద్రరావు, లక్ష్మీపతిగౌడ్, శ్రీనివాసాచారి, రమేశ్, అనురాధ, మదన్‌నాయక్, శ్రీనివాసమూర్తి, వీరభద్రుడు, బైరెడ్డి వెంకటేశ్వర్లు, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు