
వానాకాలంలో 6,03,124 ఎకరాల్లో సాగు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో రాబోయే వానాకాలం పంటల విస్తీర్ణాన్ని వ్యవసాయశాఖ అంచనా వేసింది. గత వానాకాలం సీజన్ కంటే ఈసారి పంటల విస్తీర్ణం స్వల్పంగా పెరగనుంది. గత వానాకాలంలో 5,92,264 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలను రైతులు సాగు చేయగా వచ్చే వానాకాలంలో 6,03,124 ఎకరాలు సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. ఎప్పటిలాగే వరి, మొక్కజొన్న, పత్తి, ఆయిల్‌పామ్ పంటల విస్తీర్ణం అధికంగా ఉంది. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రోత్సాహంతో గతేడాది 550 ఎకరాల్లో మునగ సాగు చేయగా, ఈసారి 2,500 ఎకరాలకు చేరుకోనుంది.
మునగ సాగు పెరిగే అవకాశం
కలెక్టర్ ప్రోత్సాహంతో జిల్లాలో వచ్చే వానాకాలంలో మునగసాగు పెరగనుంది. గత సంవత్సరం మునగసాగు కంటే మరో నాలుగురెట్లు ఎక్కువగా సాగయ్యే అవకాశం ఉంది. లాభదాయకమైన పంట కావడంతో రైతులు మక్కువ చూపుతున్నారు. –వి.బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారి
వచ్చే సీజన్‌పై అంచనా వేసిన
వ్యవసాయ శాఖ
గత, రానున్న వానాకాలం సీజన్లలో పంటల విస్తీర్ణం వివరాలు..
పంట గత సీజన్ రానున్న సీజన్
ఆగ్రో ఫారెస్ట్రీ 28,414 28,982
వరి 1,64,663 1,60,956
మొక్కజొన్న 85,828 85,544
పత్తి 2,03,561 2,04,632
వేరుశెనగ 2,736 2,791
పండ్ల మొక్కలు 9,995 10,195
జీడిపప్పు 11,670 11,903
కోకోవ 640 652
కొబ్బరి 1,769 1,805
ఆయిల్‌పామ్ 63,486 75,000
మినుము 840 857
పెసర 128 131
కంది 1,136 1,159
మిర్చి 10,284 10,489
కూరగాయలు 492 501
ఇతర పంటలు 6,073 5,025
మునగ 550 2,500
మొత్తం 5,92,264 6,03,124