
తాగునీటికి ఢోకా లేనట్టే..
సమ్మక్క బరాజ్ నుంచి దుమ్ముగూడెం ఆనకట్టకు నీరు
అశ్వాపురం : కుమ్మరిగూడెంలోని దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఆనకట్ట వద్ద ఇటీవల నీరు తగ్గగా ఏప్రిల్, మే నెలల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఇరిగేషన్, మిషన్ భగీరథ అధికారుల ఆధ్వర్యంలో సమ్మక్క–సారక్క బరాజ్ నుంచి ఈనెల 14న 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ నీరు బుధవారం ఆనకట్ట వద్దకు చేరింది. దీంతో నీటిమట్టం 47.7 మీటర్లకు చేరింది. నిరంతరాయంగా నీరు విడుదలై నీటిమట్టం 49.6 మీటర్లకు పెరిగితే ఈ వేసవి కాలంలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది ఉండదు.