Reserve Bank Of India: మన దేశంలో ఇల్లీగల్ లోన్ యాప్స్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. నిబంధనలకు విరుద్దంగా ఉన్న లోన్ యాప్స్‌పై చర్యలు తీసుకునేందుకు కొత్త చట్టాన్ని అమలు చేయనుంది.
ఆర్‌బీఐ వర్కింగ్ గ్రూప్ సిఫార్సులు
ఇన్ స్టంట్‌లోన్, క్విక్ లోన్ పేరుతో ఆన్‌లైన్ కొన్ని మనీ లోన్ యాప్స్ సామాన్యుల్ని ఊరించేవి. దీంతో ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు పలువురు లోన్ యాప్స్‌లో అవసరానికి తగ్గట్లు మనీని తీసుకునే వారు. తీసుకున్న తరువాత అధిక వడ్డీల పేరుతో వేధించేవారు. కొన్నిసార్లు లోన్ యాప్ నిర్వహకులు బెదిరింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి.
దీంతో ఆర్బీఐ ఈ ఏడాది జనవరి 13, 2021న యాప్ నిర్వహకులపై చర్యలు తీసుకునేలా ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ (డబ్ల్యుజి) పేరుతో ప్రత్యేకంగా ఓ ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానల్ సభ్యులు యాప్‌ల ద్వారా అక్రమ రుణాలను నివారించేందుకు ప్రత్యేక చట్టం తీసుకోవాలని ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆర్‌బీఐ వర్కింగ్ గ్రూప్ సిఫార్సు చేసింది. అలాగే డిజిటల్ రుణాల యాప్‌లకు నోడల్ ఏజెన్సీ ద్వారా ధ్రువీకరణ ప్రక్రియ అమలు చేయాలని పేర్కొంది. డిజిటల్ రుణాల వ్యవస్థలోని సంస్థలకు స్వయం నియంత్రణ సంస్థ (ఎస్‌ఆర్‌వో) ఉండాలని సూచించింది. కస్టమర్ల ప్రయోజనాలు కాపాడటం, నవకల్పనలను ప్రోత్సహిస్తూనే డిజిటల్ రుణాల వ్యవస్థను సురక్షితంగా మార్చడంపై కమిటీ నివేదిక ప్రధానంగా దృష్టి పెట్టినట్లు ఆర్‌బీఐ తెలిపింది.
ఈ సిఫార్సులపై సంబంధిత వర్గాలు డిసెంబర్ 31లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు, మొబైల్ యాప్‌ల ద్వారా రుణాలపై అధ్యయనం చేసేందుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయంత్ కుమార్ దశ్ సారథ్యంలో 2021 జనవరిలో ఆర్‌బీఐ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫర్సులు బట్టి డిజిటల్ రుణాల సంస్థలు లోన్‌లను నేరుగా రుణగ్రహీతల బ్యాంకు ఖాతాల్లోనే వేయాల్సి ఉంటుంది, అలాగే ఖాతాల నుంచే చెల్లింపులు తీసుకోవాలి. రికవరీ విషయంలో ప్రతిపాదిత ఎస్‌ఆర్‌వో నైతిక నియమావళి ప్రకారం నడుచుకోవాలి. రుణాల సంస్థలకు సంబంధించి ఎస్‌ఆర్‌వో ప్రత్యేకంగా నెగెటివ్ లిస్ట్ నిర్వహించాలి.
600ఫేక్ యాప్స్
ఆర్బీఐ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ సభ్యుల ప్యానల్ ఆన్‌లైన్‌లో మొత్తం 1100లోన్ యాప్స్ ఉండగా వాటిలో 600యాప్స్ చట్టవిరుద్దంగా ఉన‍్నాయని గుర్తించింది. చట్టానికి వ్యతిరేకంగా లోన్స్ ఇచ్చే యాప్స్‌ను బ్యాన్ చేసేలా కొత్త చట్టాన్ని అమలు చేయాలని తెలిపారు.
వర్క్ గ్రూప్ ప్యానల్ సభ్యుల నివేదిక
ఆర్బీఐ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ సభ్యులు..లోన్ యాప్స్‌పై జనవరి 2020 నుండి మార్చి 2021 వరకు దాదాపు 2,562 ఫిర్యాదులు అందినట్లు గుర్తించారు. ఆర్‌బిఐ నివేదిక ప్రకారం మహారాష్ట్రలో అత్యధికంగా ఫిర్యాదులు అందగా, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా, తెలంగాణ,ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
చదవండి: ఇస్మార్ట్ హోటల్..ఇవేమన్నా "మార్చురీ" గదులా?,సెటైర్లు పడ్డా ఎలా సక్సెస్ అయ్యిందంటే
Comments
Please login to add a commentAdd a comment