Actress Kajal Agarwal Joins With Ayurveda Co in Series A Round - Sakshi
Sakshi News home page

సినీ నటి కాజల్‌ అగర్వాల్‌ కొత్త అవతార్‌: అదేంటో తెలుసా?

Published Fri, Nov 25 2022 2:07 PM | Last Updated on Fri, Nov 25 2022 2:54 PM

Actress Kajal Aggarwaljoins with Ayurveda Co in Series A round - Sakshi

హైదరాబాద్‌: ఆయుర్వేద ఉత్పత్తుల విక్రయంలో ఉన్న ద ఆయుర్వేద కంపెనీ (టీఏసీ)..సిరీస్‌-ఏ రౌండ్‌లో సినీ నటి కాజల్‌ అగర్వాల్‌ నుంచి పెట్టుబడి అందుకుంది. డైరెక్ట్-టు-కన్స్యూమర్ ఆయుర్వేద బ్రాండ్ తన సిరీస్ఏలో టాలీవుడ్ నటి కాజల్ పెట్టుబడి పెట్టినట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే విప్రో కంజ్యూమర్‌ కేర్‌ వెంచర్స్‌ పెట్టుబడి పెట్టింది. ఈ-కామర్స్‌ పోర్టల్స్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో 1,000కిపైగా కౌంటర్లలో టీఏసీ ఉత్పత్తులు లభిస్తాయి.  

అయుర్వేదానికి ఈ ప్రపంచాన్ని మార్చే శక్తిని కలిగి ఉందని నిజంగా తాను నమ్ముతానని కాజల్‌ అగర్వాల్‌ చెప్పారు. అందుకే ఆయుర్వేద కంపెనీ మిషన్‌లో చేరానని తెలిపారు.  కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో కాజల్‌ ‘దశపుష్పది’ ప్రొడక్ట్‌  ప్రకటనల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. 

రాబోయే తరాలకు ఆయుర్వేదం అందించే ఫలాలను అందించాలనుకుంటున్నాం. ముఖ్యంగా  జీవితాన్ని మార్చే అలవాట్లు, ప్రయోజనాలను పరిచయం చేయాల్సిన సమయం ఆసన్నమైందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధా సింగ్ వెల్లడించారు. మెరుగైన జీవన నాణ్యతకు ఆయుర్వేద ఉపయోగ పడుతుందన్నారు. అలాగే కాలక్రమంలో ఆయుర్వేదానికి దూరమైపోతున్న మిలీనియల్స్‌కు శక్తివంతమైన సాంప్రదాయ వ్యవస్థను అందించాలని శ్రీధా సింగ్ పేర్కొన్నారు.


.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement