ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాబట్టే విషయంలోనూ వేగంగా ముందుకు సాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డ్‌లను నమోదు చేసింది. ఆర్ధిక సంవత్సరం 2022-2023 నాటికి అత్యధికంగా 284.22 మిలియన్ డాలర్లను రాష్ట్రం రాబట్టినట్లు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాష్ తెలిపారు.
టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్య సభలో మాట్లాడుతూ.. 2019 నుంచి రాష్ట్రానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వివరాలు చెప్పాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సోమ్ ప్రకాష్‌ను కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను రాబట్టే విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం విఫలమైందని చూపేందుకు ప్రతిపక్ష టీడీపీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. మే 2019 నుంచి రాష్ట్రంలో ఎఫ్‌డీఐ ప్రవాహం భారీగా తగ్గిపోయిందని, ఫలితంగా ఉపాధి కల్పన, ఉద్యోగావకాశాలు పడిపోయాయని ప్రభుత్వానికి తెలుసా? తెలియదా? అంటూ టీడీపీ ప్రశ్నించింది.
కనకమేడల ప్రశ్నకు కేంద్ర మంత్రి సోమ్ ప్రకాశ్ ఊహించని రీతిలో సమాధానం ఇచ్చారు. ఏపీకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కడా తగ్గలేదని, ఇంకా చెప్పాలంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ‘ఆల్ టైమ్ రికార్డ్’ స్థాయిలో పెరిగాయని చెప్పారు.
మహమ్మారి కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడులు తాత్కాలికంగా తగ్గాయని’ రాత పూర్వకంగా పేర్కొన్నారు. అక్టోబర్ 2019 నుండి మార్చి 2023 వరకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన విదేశీ పెట్టుబడులు స్థిరంగా పెరుగుతున్నట్లు తెలిపారు. 2019-20 (అక్టోబర్ 2019-2020)లో ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన మొత్తం ఎఫ్‌డిఐ పెట్టుబడులు 200.97 మిలియన్లు. మహమ్మారి కారణంగా 2020-21లో ఇది 85.85 మిలియన్లకు తగ్గింది. కానీ 2021-22లో 224.96 మిలియన్లకు, 2022-23లో 284.22 మిలియన్లకు పెరిగింది’అని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాష్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment