
పలువురు లోక్‌సభలోని ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ ఫోన్ వార్నింగ్ అలర్ట్ పంపిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎంపీల యాపిల్ ఐడీ ఆధారంగా స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్లు వారి ఐఫోన్, ఈ-మెయిల్స్ హ్యాక్ చేస్తున్నట్లు అలర్ట్ మెసేజ్‌లు వస్తున్నాయి. ఇప్పటికే త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీ ప్రియాంక చతుర్వేదికు అలర్ట్‌లు వచ్చినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన మెసేజ్‌లను తమ ఎక్స్ ఖాతాద్వారా ప్రముఖులు పంచుకున్నారు.
ఈ అలర్ట్‌లను ఉద్దేశించి యాపిల్ స్పందించింది. స్టేట్ స్పాన్సర్డ్ అటాక్ నోటిఫికేషన్‌లు కొన్నిసార్లు తప్పుడు అలారాలు కావచ్చని యాపిల్ చెప్పింది. అలా అటాక్ చేసేవారి వద్ద అధునాతన టెక్నాలజీ ఉంటుందని పేర్కొంది. దాంతో వారు ఎలాంటి దాడికైనా పాల్పడే అవకాశం ఉందని చెప్పింది. అయితే అలా వస్తున్న అలర్ట్‌ల్లో కొన్ని తప్పుడు నోటిఫికేషన్లు ఉండవచ్చని యాపిల్ వివరించింది. ఈ నోటిఫికేషన్‌ల జారీకి గల కారణాలపై వ్యాఖ్యానించడానికి కంపెనీ నిరాకరించింది. ఎందుకంటే పూర్తి వివరాలు వెల్లడిస్తే భవిష్యత్తులో దాడిచేసే వారిని గుర్తించకుండా తప్పించుకోవడానికి సహాయపడినట్లు అవుతుందని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment