బోయింగ్‌కు ఆజాద్‌ ఎన్‌ఏఎస్‌ విడిభాగాలు | Azad Engineering begins delivery of NAS parts to Boeing | Sakshi
Sakshi News home page

బోయింగ్‌కు ఆజాద్‌ ఎన్‌ఏఎస్‌ విడిభాగాలు

Published Sat, Nov 26 2022 6:38 AM | Last Updated on Sat, Nov 26 2022 6:38 AM

Azad Engineering begins delivery of NAS parts to Boeing - Sakshi

హైదరాబాద్‌: విమానాల తయారీ దిగ్గజం బోయింగ్‌కు తొలి విడిభాగాల కన్సైన్‌మెంట్‌ను అందించినట్లు ఆజాద్‌ ఇంజినీరింగ్‌ తెలిపింది. జాతీయ ఏరోస్పేస్‌ ప్రమాణాలకు (ఎన్‌ఏఎస్‌) అనుగుణంగా వీటిని ఉత్పత్తి చేసినట్లు వివరించింది.

వివిధ బోయింగ్‌ విమానాలకు అవసరమైన కీలక ఏరోస్పేస్‌ భాగాలు వీటిలో ఉన్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు రాకేష్‌ చాప్దర్‌ తెలిపారు. ప్రతిష్టాత్మక ఆత్మనిర్భర భారత్‌ నినాదంలో భాగంగా హైదరాబాద్‌లో అదనంగా మరో యూనిట్‌ను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఏరోస్పేస్, రక్షణ తదితర రంగాలకు అవసరమైన ఉత్పత్తులను ఆజాద్‌ ఇంజినీరింగ్‌ తయారు చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement