దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ వారంలో వరుసగా మూడవ రోజు సైతం అదే జోరును కొనసాగిస్తున్నాయి. బుధవారం ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్ 274 పాయింట్లు లాభంతో 65350 వద్ద నిఫ్టీ 77 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి.
టెక్ మహీంద్రా, హిందాల్కో, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, ఆల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, బజాజ్ ఆటోషేర్లు లాభాల్లో ఉన్నాయి. బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అపోలో హాస్పిటల్స్, హీరోమోటోకార్ప్, నెస్లే, ఎన్‌టీపీసీ, బ్రిటానియా షేర్లు నష్టాల వైపు కదలాడుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందించనున్న పూర్తి వీడియో చూడండి..
Comments
Please login to add a commentAdd a comment